హోటల్లో కుళ్లిపోయిన ఆహారం

NLR: బుచ్చి పట్టణంలోని ఎస్.ఎస్ గ్రాండ్ ఇన్ హోటల్‌ను కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తనిఖీ చేశారు. కుళ్ళిపోయిన ఆహారాన్ని సరఫరా చేస్తున్నారని కస్టమర్ ఫిర్యాదు చేయడంతో కమిషనర్ తనిఖీ చేయగా ఫ్రిజ్‌లో పెట్టిన చికెన్, నూడిల్స్, భోజనాన్ని, నిర్వీర్యం చేశారు. యజమానికి పెనాల్టీ విధించి మరోసారి ఇలా చేస్తే కేసు పెడతామని హెచ్చరించారు.