శాంతి భద్రతలపై దృష్టి.. గ్రామసభలో కీలక నిర్ణయాలు
WGL: వర్ధన్నపేట మండలం ఇల్లందలో సర్పంచ్ బేతి సాంబయ్య అధ్యక్షతన సోమవారం గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో శాంతి భద్రతలను మెరుగుపరచేందుకు ప్రధాన కూడళ్లలో సుమారు 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి రాకుండా మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.