ఈ నెల 19న PM కిసాన్ డబ్బులు
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 19న వారి ఖాతాల్లో 21వ విడత PM కిసాన్ నిధులు జమ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు 20 విడతల్లో మొత్తం రూ.3.70 లక్షల కోట్లు జమ చేసింది. PM కిసాన్ పోర్టల్‌లో నమోదై, బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ అయినవారికే ఈ పథకం ప్రయోజనం అందుతుంది.