జామిలో కోటి సంతకాల సేకరణ ప్రారంభం
VZM: ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటుకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జామి మండల పార్టీ అధ్యక్షుడు జి. రవికుమార్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డా. పి.వి.వి. సూర్యనారాయణ రాజు ప్రారంభించారు.