మార్కాపురం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
ప్రకాశం: మార్కాపురం పట్టణంలో ఆదివారం వైసీపీ ఇన్‌ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పది మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనివల్ల పేదలు నష్టపోతారని అన్నా వెంకట రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు.