VIDEO: కనిగిరిలో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ

ప్రకాశం: కనిగిరిలోని సాయినగర్‌లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. డ్రైనేజీ కాలువల్లో వ్యర్ధాలు పేరుకుపోవడంతో మురుగునీరు డ్రైనేజీ కాలువల్లో ప్రవహించే అవకాశం లేక రోడ్లపై ప్రవహిస్తున్నాయి. దీంతో తీవ్రదుర్గంధం వెదజల్లుతూ స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువల్లో పూడిక తీయాలని స్థానికులు కోరుతున్నారు.