పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత: UTF
VKB: నూతన ఉపాధ్యాయుల సర్వీస్ పుస్తకాలను రాయించడంలో MEO అలసత్వం చూపిస్తున్నారని UTF జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు అన్నారు. కొడంగల్ మండలంలోని వివిధ పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. సర్వీస్ పుస్తకాలను వెంటనే రాయించాలని సూచించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని, విద్యావాలంటీర్లను నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో UTF నాయకులు పాల్గొన్నారు.