నేడు నగరానికి వర్ష సూచన
HYD: నవంబర్ వచ్చినా గ్యాప్ లేకుండా వర్షాలు కురుస్తునే ఉన్నాయి. ఇవాళ కూడా నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలో భారీ నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీంతో ప్రజలు అవసరమైతేనే తప్పా బయటికి వెళ్లాలని, వాహనదారులు, లోతట్టు ప్రాంత వాసులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.