పిల్లల విక్రయం.. పెళ్లి కాకుండానే మహిళ ప్రసవాలు..!
NDL: నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామానికి చెందిన పెళ్లి కాని మహిళ నిన్న ఇంట్లో బిడ్డకు జన్మనిచ్చారు. శిశువుకు హెల్త్ బాగాలేకపోవడంతో కుటుంబ సభ్యులు GGHకి తీసుకెళ్లారు. గతంలోనూ ఆమెకు రెండు ప్రసవాలు జరిగినట్లు గుర్తించిన సిబ్బంది కంగుతిన్నారు. బిడ్డలను కని, విక్రయించడమే వారి వ్యాపారమని స్థానికులు చెబుతున్నారు. శిశువును కేర్ సెంటర్‌కు తరలించారు.