ముదిరాజ్ సహకార సంఘం భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
WGL: NSPT మున్సిపాలిటీ పరిధిలోని మాదన్నపేట ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది. రూ.10 లక్షల నిధులతో నిర్మించిన ఈ భవనాన్ని MLA దొంతి మాధవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ముదిరాజులు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. మార్కెట్ ఛైర్మన్ పాలాయి శ్రీనివాస్, తదితరులున్నారు.