VIDEO: కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం(మం) కురస కన్నప్పగూడెం గ్రామ సమీపంలో మంగళవారం పెను ప్రమాదం తప్పింది. పొగాకు లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. పొగాకు ఆకు కొట్టుకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.