మేడారం ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్
MLG: మేడారం జాతర సమయంలో ఓ బాలికపై లైంగిక దాడి జరిగిందంటూ మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషన్ ఛైర్మన్ విజయా రాహత్కర్ విచారణకు ఆదేశించారు. ఈరోజు నుంచి ప్రారంభమయ్యే విచారణ కమిటీకి ఎన్‌సీడబ్ల్యూ సభ్యురాలు డెలినా అధ్యక్షత వహించనుండగా, కంచన్ కట్టర్ సభ్యురాలిగా ఉండనున్నారు.