నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

GNTR: కాకుమాను మండలంలో శనివారం 11kv విద్యుత్ లైన్‌ల మరమ్మతుల కారణంగా విద్యుత్‌కు అంతరాయం ఏర్పడును. కొమ్మూరు, కొండపాటూరు, గార్లపాడు, పీవీ పాలెం, రేటురు, అప్పాపురం, చిన్న లింగాయపాలెం గ్రామాలలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఏఈ ఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు అధికారులకు సహకరించాలని కోరారు.