ఈ పళ్లను తింటే మాత్రం స్వర్గమే.!
NDL: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మామిడి పళ్లలో 'బంగినపల్లి' రారాజు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రారాజు పుట్టినిళ్లు మాత్రం నంద్యాల జిల్లాలోని బనగానపల్లె అని చాలా కొద్దిమందికే తెలుసు. నాటి పాలకులు మామిడిపళ్లపై మక్కువతో బనగానపల్లెలో మామిడి చెట్లు నాటించారు. ఈ పల్లెలో పుట్టిన మామిడి కాలానుక్రమంగా బంగినపల్లిగా పేరుగాంచింది. ఈ పళ్లను తింటే మాత్రం స్వర్గం లాంటి అనుభూతి ఉంటుందని నానుడి.