టీయూలో గందరగోళం.. హైకోర్టు తీర్పుపై సస్పెన్స్‌

టీయూలో గందరగోళం.. హైకోర్టు తీర్పుపై సస్పెన్స్‌

NZB: తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్‌ స్టాపబుల్‌ గందరగోళం కొనసాగుతోంది. హైకోర్టు తీర్పు అనంతరం పరిపాలన విభాగానికి వచ్చిన VC, రిజిస్ట్రార్‌లు గంటల కొద్దీ భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పు పర్యావసానాలపై వీరు ఇద్దరు చర్చించినట్లుగా అంతా భావిస్తున్నారు. వీరితో రద్దు కాబడిన పలువురు ప్రొఫెసర్లు కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఐదుగురు ఆచార్యులు నేరుగా వీసీ ఛాంబర్‌కు వెళ్లి సమావేశమైనట్లుగా TU వర్గాలు చెబుతున్నాయి