తనను గెలిపిస్తే ఇంటికి రూ.5 లక్షల బీమా!
TG: రంగారెడ్డి జిల్లా కొత్తపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి పసుల వనమ్మ తనను గెలిపిస్తే ప్రతి ఇంటికీ రూ.5 లక్షల జీవిత బీమా చేయిస్తానని ప్రకటించారు. గ్రామంలోని 700 కుటుంబాలకు ఏడాదికి రూ.8.40 లక్షల ప్రీమియం తానే భరిస్తానని, ఐదేళ్లలో రూ.42 లక్షలకుపైగా ఖర్చు చేస్తానని తెలిపారు. ఆడబిడ్డ పుడితే 'బంగారు తల్లి' పథకం కింద రూ.5 వేల FDతోపాటు 15 హామీలను మేనిఫెస్టోలో పేర్కొన్నారు.