అంత్యక్రియల్లో తేనెటీగల దాడి.. నలుగురికి గాయాలు
KNR: అంత్యక్రియల వేళ తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో నలుగురు గాయపడిన ఘటన సైదాపూర్ మండలం వెన్నంపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మొలుగురి వంశీ (25) బంధువుల దహన సంస్కారాల్లో పాల్గొనగా ఈ దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన వంశీ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 108 సిబ్బంది సతీశ్ రెడ్డి, కాజా ఖలీలుల్లా సకాలంలో స్పందించి, ప్రథమ చికిత్స అందించారు.