ఆడబిడ్డల సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే
MBNR: ప్రజాపాలనలో ఆడబిడ్డల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ రూరల్ మండలానికి చెందిన పలువురికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. మహిళల అభివృద్ధి, సాధికారత కోసం ప్రభుత్వం వారి పేరుతోనే అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తుందని ఆయన గుర్తుచేశారు.