అండర్ 19 క్రికెటర్ ఆరోన్ జార్జ్‌కు మంత్రి సన్మానం
HYD: భారత అండర్-19 టాప్ ఆర్డర్ బ్యాటర్ ఆరోన్ జార్జ్ వర్గీస్‌ను మంగళవారం HYDలో మంత్రి వాకిటి శ్రీహరి ఘనంగా సన్మానించారు. వినూ మన్కడ్ ట్రోఫీని 38 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌ను గెలిపించిన కెప్టెన్‌గా, ఆసియా కప్‌లో 69 పరుగులు సాధించిన వర్గీస్‌ను అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని రికార్డులు సృష్టించి దేశ కీర్తిని పెంచాలని మంత్రి ఆకాంక్షించారు.