VIDEO: రైతులకు యూరియా సరఫరా చేయాలి: మాజీ మంత్రి

JN: రైతులకు సరిపడా యూరియా అందించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. దేవరుప్పుల మండలం కోలుకొండలో శుక్రవారం ఆయన స్థానిక రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సరైన మోతాదులో యూరియా సరఫరా చేయాలని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన అధికారులను కోరారు.