'దుద్యాల్లో 'రన్ ఫర్ యూనిటీ' కార్యక్రమం ఘనంగా నిర్వహణ'
VKB: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం దుద్యాల్లో 'రన్ ఫర్ యూనిటీ' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పరుగులో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజేతలకు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మెరుగు వెంకటయ్య, SI యాదగిరితో కలిసి బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి రూ.2000, 2వ బహుమతి రూ. 1500, 3వ బహుమతి రూ.1000 అందజేశారు.