పెద్దూరులో నందీశ్వరుడికి వెండి నాగపడిగలు సమర్పణ

పెద్దూరులో నందీశ్వరుడికి వెండి నాగపడిగలు సమర్పణ

అన్నమయ్య: చిట్వేల్ మండలం పెద్దూరులోని శివాలయంలో నందీశ్వరుడికి టీడీపీ సీనియర్ నాయకుడు కస్తూరి కోటేశ్వర చౌదరి వెండి నాగపడిగలు సమర్పించారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాధ నాయుడు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ ఘనంగా సన్మానం చేయగా, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.