అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ సందర్శించిన కలెక్టర్, CP

అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ సందర్శించిన కలెక్టర్, CP

MNCL: కోటపల్లి మండలం రాపనపల్లి వద్ద యూరియా ఎరువుల అక్రమ రవాణా నియంత్రణకై ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్‌ను CP అంబర్ కిషోర్ ఝా, కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి మంగళవారం సందర్శించారు. విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. యూరియా దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు.