కసాపురం అంజన్నకు వెండి రథోత్సవం.!

కసాపురం అంజన్నకు వెండి రథోత్సవం.!

ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఆలయ అధికారి ఈవో వాణి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద పండితులు స్వామివారి ఉత్సవమూర్తికి విశేష పుష్పాలు, స్వర్ణాభరణాలతో అలంకరించారు. పంచామృతాలతో అభిషేకించి వెండి రథోత్సవం అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.