'కాంగ్రెస్ గుండాల తీరు మార్చుకోవాలి'
BDK: ఓటమి భయంతో మణుగూరు మండల సమితి BRS పార్టీ ప్రచార వాహనంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం సిగ్గుచేటు అని BRS పాల్వంచ పట్టణ అధ్యక్షులు రాజు గౌడ్ ఇవాళ అన్నారు. నాయకులను బెదిరిస్తున్న కాంగ్రెస్ గుండాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేదంటే రానున్న రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు ఇలా చేస్తున్నారని అన్నారు.