గౌతు లచ్చన్నకు ఘన నివాళి

గౌతు లచ్చన్నకు ఘన నివాళి

W.G: స్వాతంత్య్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఆమె మాట్లాడారు. లచ్చన్న దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.