'త్రాగునీటి సమస్యను పరిష్కరించండి'

'త్రాగునీటి సమస్యను పరిష్కరించండి'

KDP: సిద్దవటం మండలంలోని ముమ్ముడిగుంటపల్లి, బ్రాహ్మణపల్లి, మొహిదీన్ సాహెపల్లి గ్రామాల్లో గత కొన్ని రోజులుగా త్రాగునీరు లభించక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గ్రామంలో నీటి సమస్య పట్టించుకుండే నాధుడే కరువయ్యారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు కిలోమీటర్లు పరిధిలో ఉన్న పంట పొలాల్లో మోటార్ వద్ద త్రాగునీరు తెచ్చుకుంటున్నామని వాపోయారు.