సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

SRD: జాతీయ లోక్ అదాలత్ సెప్టెంబర్ 13వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర తెలిపారు. సంగారెడ్డిలోని జిల్లా కోర్టులో పోలీస్ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రాజి కుదుర్చుకునే కేసులను జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.