పెద్దకడబూరులో యోగాంధ్ర కార్యక్రమంపై ర్యాలీ

పెద్దకడబూరులో యోగాంధ్ర కార్యక్రమంపై ర్యాలీ

KRNL: పెద్దకడబూరులో ఎంపీడీఓ ప్రభావతి దేవి ఆధ్వర్యంలో సోమవారం యోగాంధ్ర కార్యక్రమంపై ర్యాలీ చేశారు. యోగా ద్వారా ఆరోగ్యవంతమైన జీవనం గడపాలని నినాదాలు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో జరిగిన సమావేశంలో ఎంపీడీఓ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ యోగా చేయాలని కోరారు. యోగా చేయడం వలన రోగాలు దరికి రావన్నారు. టీడీపీ నేత రమాకాంతరెడ్డి, వైసీపీ నేత రామ్మోహన్ రెడ్డి ఉన్నారు.