కరాటేలో భానుశ్రీకి స్వర్ణ పతకం
SDPT: జగదేవపూర్ మండలం దౌలాపూర్ గ్రామానికి చెందిన పోకల మంజుల కుమార్తె భానుశ్రీ జిల్లా స్థాయి కరాటే పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. ఇటీవల నల్గొండలో జరిగిన ఈ పోటీలలో భానుశ్రీ బంగారు పతకం సాధించింది. ఈ సందర్భంగా, జగదేవపూర్ మోడల్ స్కూల్‌కి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన నాయకులు చిలుకూరి మహేందర్ రెడ్డి, భానుశ్రీని ఘనంగా సత్కరించి అభినందించారు.