ఏలూరులో మంత్రి నేతృత్వంలో జిల్లా సమీక్ష
ఏలూరు కలెక్టరేట్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జిల్లా సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోలు, గృహాల పురోగతి, 22A కేసులు, విశాఖ CII సమ్మిట్ అంశాలపై చర్చించారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వీ వివిధ శాఖల పురోగతిపై నివేదిక ఇచ్చారు. ఇందులో మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, జాయింట్ కలెక్టర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.