రోడ్లపై ధాన్యం కుప్పలతో ఇబ్బందులు
KNR: సైదాపూర్ మండలంలో రోడ్లపై ధాన్యం కుప్పలతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా సైదాపూర్ – మొలంగూర్ ప్రధాన రహదారిపై దారి పొడవునా ధాన్యం కుప్పలు వాహనదారులకు ఇబ్బందిగా మారాయి. రైతులు ధాన్యాన్ని రోడ్లపై ఆరబోసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ధాన్యం పోసుకోవడానికి స్థలం లేక రోడ్లపై పోస్తున్నారు