నీట్ ఎక్సలెన్సీ సెంటర్‌ను తనిఖీ చేసిన మంత్రి
NTR: విజయవాడలో IIT, నీట్ ఎక్సలెన్సీ సెంటర్‌లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. SC, ST విద్యార్థుల సంక్షేమం పట్ల సీఎం ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు.