'బోరు బావుల విద్యుత్ బిల్లులు చెల్లించాలి'

'బోరు బావుల విద్యుత్ బిల్లులు చెల్లించాలి'

కామారెడ్డి జిల్లాలోని భిక్కనూర్ మండలంలోని బోరు బావుల విద్యుత్ బిల్లులను ఈనెల 20వ తేదీ లోపు చెల్లించాలని విద్యుత్ శాఖ ఏఈ సంకీర్త్ నేడు ఒక ప్రకటనలో సూచించారు. బోరు బావుల కింద విద్యుత్ కనెక్షన్ ఉన్న ప్రతి రైతు 2025-26 సంవత్సరానికి సంబంధించి రూ.360 చెల్లించాలన్నారు. విద్యుత్ కెపాసిటర్లు బిగించుకోవాలని రైతులకు సూచించారు.