ఈ తేదీల్లో మాంసం దుకాణాల బంద్: కమిషనర్

SRD: సంగారెడ్డి మున్సిపాలిటీలో 15, 16 తేదీల్లో మాంసం దుకాణాలు బంద్ చేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గురువారం ప్రకటనలో తెలిపారు. 15న స్వాతంత్ర దినోత్సవం, 16వ తేదీన కృష్ణాష్టమి సందర్భంగా దుకాణాలు బంద్ చేయాలని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని మాంసం దుకాణాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.