పోగొట్టుకున్న నగదు అందజేత..

HNK: దారిలో దొరికిన నగదును పోలీసులకు అందించి ఓ వ్యక్తి నిజాయితీని చాటుకున్నాడు. హన్మకొండలోని ఇందిరనగర్ SBI ఏటీఎం నుంచి నగదు డ్రా చేసి శ్రీనివాసరావు వెళుతుండగా రోడ్డుపై పడడంతో దుబ్బేటి రాము గమనించి 10వేలు నగదు పోలీసులకు అప్పగించాడు. గురువారం సుబేదారి ఇన్స్‌ఫెక్టర్ రంజిత్ సమక్షంలో బాధితుడికి అట్టి నగదును అందజేశారు. అనంతరం రామును పోలీసులు అభినదించారు.