అధిక వడ్డీల పేరుతో ఇబ్బంది పడితే చర్యలు: ఏసీపీ
NTR: విజయవాడలో ఎవరైనా అధిక వడ్డీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని సెంట్రల్ ఏసీపీ దామోదర్ తెలిపారు. అధిక వడ్డీ బాధితులు సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చెయ్యాలని సూచించారు. అప్పు కట్టడంలేదని వారిపై దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదు లేదని హెచ్చరించారు. అధిక వడ్డీ పేరుతో ప్రజలను ఇబ్బంది పెడితే ధైర్యంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.