'పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి'

'పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి'

AKP: గ్రామాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్. రాయవరం ఎంపీడీవో మీనా కుమారి, డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ సూచించారు. సోమవారం పెదగుమ్ములూరు, గెడ్డం పాలెం గ్రామాల్లో పర్యటించి పారిశుధ్య పరిస్థితిని పరిశీలించారు. సంపద కేంద్రాలను సందర్శించారు. చెత్తను సంపద కేంద్రాలకు తరలించి సేంద్రియ ఎరువుగా మార్చాలన్నారు.