కిరాణా దుకాణంలో భారీ చోరీ

కిరాణా దుకాణంలో భారీ చోరీ

KDP: సిద్ధవటం మండలం మాధవరం గ్రామంలో భారీ చోరీ జరిగింది. సోమవారం రాత్రి ఓ దుకాణం తాళాలు పగలగొట్టి దుండగులు సుమారు రూ.1,45,000 నగదును ఎత్తుకెళ్లారు. దుకాణంలోని రూ.25 వేలు, భార్య పొదుపు సొమ్ము రూ.40 వేలు, వ్యాపార నగదు రూ.70 వేలు పోయాయని బాధితుడు సుధాకర్ వాపోయాడు. ఎనిమిదేళ్లుగా వ్యాపారం చేస్తున్న తనకు తీరని నష్టం వాటిల్లిందని తెలిపాడు.