VIDEO: హత్య కేసును చేదించిన పోలీసులు
కోనసీమ: ఏడేళ్ల క్రితం రాజోలు నియోజకవర్గంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాజోలు మండలం సోంపల్లిలో కొప్పాడి వీర రాఘవులు అనే వ్యక్తిని బీరు బాటిళ్లతో కొట్టి శ్రీనివాస్, శ్రీను, పల్లపురాజు హత్య చేశారు. కేసులో ముద్దాయిలను ఏడేళ్ల తర్వాత అరెస్టు చేసినట్లు రాజోలు సీఐ నరేష్ మంగళవారం చెప్పారు. వీరిలో పల్లపురాజు గతంలో చనిపోగా మిగిలిన ఇద్దరిని అరెస్టు చేశారు.