'తీరంలో అక్రమ నిర్మాణాలు ఆగాలి'
BPT: పర్యాటకం పేరుతో మత్స్యకారుల పొట్టకొట్టొద్దని మాజీ ఎమ్మెల్యే ఆమంచి అన్నారు. చీరాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా తీరంలో అక్రమ లేఅవుట్లు, రిసార్టులు నిర్మిస్తున్నారన్నారు. అధికారులే వీటికి అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనొద్దని ప్రజలకు సూచించారు.