VIDEO: దహేగాంలో పెద్దపులి సంచారం – భయాందోళనలో గ్రామాలు!
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఎర్రవాగు సమీపంలోని తంగళ్లపల్లి, చిన్న తిమ్మాపూర్ గ్రామాల పంట పొలాల్లో పులి అడుగులను గ్రామస్తులు బుధవారం గుర్తించారు. దీంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురై అటవీ అధికారులకు సమాచారం అందించారు. కాగజ్‌నగర్ అటవీ విభాగ అధికారులు గమనించారు.