డెంకాడలో 9 మంది అరెస్ట్

VZM: డెంకాడ మండలం చొల్లంగిపేటలో 9 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పోలీసులు రైడ్ చేయగా గ్రామంలోని రచ్చబండ వద్ద పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.5,250 స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కోర్టుకు అప్పగించామని పోలీసులు తెలిపారు.