ఆళ్లగడ్డలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీ

ఆళ్లగడ్డలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీ

KRNL: ఆళ్లగడ్డ పట్టణంలో ఆదివారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా చైతన్య ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రి నుండి టీబీ రోడ్డు మీదుగా నాలుగు రోడ్ల కూడలి వరకు ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. సొసైటీ వర్ధనాచారి ఎయిడ్స్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు.