నారీ శక్తి బిల్లుపై కనిగిరిలో ర్యాలీ
ప్రకాశం: కనిగిరి మండలం నందన మారేళ్ళ జాతీయ రహదారిపై నారీ శక్తి వందన్ అధినయం (మహిళా రిజర్వేషన్ బిల్లు)కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి వైఖరిని ఖండిస్తూ బీజేపీ మండల అధ్యక్షుడు గంజి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించే ఈ చారిత్రాత్మక బిల్లును ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తప్పక ఆమోదింపజేస్తామని అన్నారు.