అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
SRD: సదాశివపేట పట్టణంలో చీల బసవరాజ్ జ్ఞాపకార్థం చీల మల్లన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ బుధవారం ప్రారంభించారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఇటువంటి కార్యక్రమాలు అభినందనీయమని, పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలకు చల్లని అంబలి అందించడం ద్వారా ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.