గందరగోళంగా శ్రీశైల దేవస్థానం వెబ్‌సైట్ నిర్వహణ

NDL: శ్రీశైల దేవస్థానం వెబ్ సైట్ ఏడాదిపాటు సవ్యంగా పని చేసింది. తర్వాత లాగిన్ విధానంలో కొన్ని షరతులతో మార్పులు, చేర్పులు చేపట్టారు. ఒక లాగిన్ ద్వారా రెండు ఆర్జిత సేవల టికెట్లు, 5 దర్శనం టికెట్లు పొందే విధంగా రూపొందించారు. లాగిన్ విధానంలో నిర్దేశించిన మేరకు టికెట్లు బుకింగ్ కావడం లేదు. సాంకేతిక లోపాలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.