చింతలపూడి మండలంలో పల్లె నిద్ర

చింతలపూడి మండలంలో పల్లె నిద్ర

W.G: చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో శనివారం రాత్రి పోలీసులు పల్లె నిద్ర చేపట్టారు. స్థానిక సీఐ రాజశేఖర్, ఎస్సై కుటుంబరావు వారి సిబ్బందితో ఈ కార్యక్రమం చేపట్టారు. గ్రామస్తులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సైబర్ క్రైమ్‌కు గురైతే వెంటనే 1930కి సమాచారం ఇవ్వాలన్నారు. అనుమానితులను గుర్తిస్తే పోలీసులకి తెలపాలని సూచించారు.