'వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి'
SRCL: తంగళ్ళపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత తెలిపారు. తంగళ్ళపల్లిలో సోమవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. తంగళ్ళపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చిన్నపిల్లల వైద్య నిపుణులు, దంత వైద్య నిపుణులు, ఎముకల వైద్య నిపుణులు, జనరల్ వైద్య నిపుణులు వస్తారన్నారు.