అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత
GDWL: మానవపాడు మండల పరిధిలోని కొర్విపాడు గ్రామ శివారులోని తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన లక్ష్మన్న ఏపీ 21 సీఈ 2769 నంబరు గల ట్రాక్టర్‌లో పర్మిషన్ లేకుండా ఇసుక తరలిస్తుండగా, గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు పట్టుకొని స్టేషన్‌కి తరలించినట్లు ఎస్సై చంద్రకాంత్ తెలిపారు.